రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం : తెలుగుదేశం పార్టీ నాయకులు
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం
తెలుగుదేశం పార్టీ నాయకులు
నెల్లూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) :
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంచల బాబు యాదవ్, బీసీ సాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొండూరు పాల్ శెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 19వ తేదీన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ ఐక్య కార్యచరణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్ష నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్రలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలిపారు.
సమావేశం రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, మోసం వంటి వాటిపై ఎండ కట్టడానికి దోహదపడుతుందని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అనగదొక్కుతున్న వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు, బీసీలను చైతన్యవంతులుగా చేసేందుకు, బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం లాంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో బీసీ నాయకులు పి.ఎల్ రావు, మహేష్ కుమార్, దోర్నాల హరిబాబు పాల్గొన్నారు.