గుడూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే వెలగపల్లి
గుడూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే వెలగపల్లి
-: గూడూరు, ఆగస్టు 8 (సదా మీకోసం) :-
గూడూరు పట్టణంలోని శ్రీ మహా లక్ష్మమ్మ వీధి, కటక రాజవీధి 9, 10వ వార్డులలో గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు పర్యటించారు.
వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని సిసి రోడ్లను మంజూరయ్యాయని వాటి పనులు త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మహా లక్ష్మమ్మ వీధిలోని ప్రజలు ఎమ్మెల్యేని కోరడం జరిగింది.
ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి, అదేవిధంగా సిసి రోడ్లు వేయనున్న కాంట్రాక్టర్ తో మాట్లాడటం జరిగింది.
దాదాపు గా పన్నెండు లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది పనులు వెంటనే జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
కటక రాజావీధిలోని సిసి రోడ్లు, డ్రైనేజీ లను పరిశీలించారు. అనంతరం వార్డులోని త్రాగునీరు పైపు పగిలిపోవడంతో త్రాగునీటి సమస్య ఉందని వార్డులోని ప్రజలు చెప్పడంతో వెంటనే గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ తో మాట్లాడటం జరిగింది.
వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అన్నం మురళి గౌడ్, మనోహర్ గౌడ్ ఉన్నారు.