మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ
మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ
నెల్లూరు ప్రతినిధి, మార్చి 27 (సదా మీకోసం) :
ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం దేశ వ్యాప్తంగా మార్చి 28,29 జరుగు దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ విషయమై స్థానిక పడుగుపాడు గూడుషెడ్ నుంచి వెంకటేశ్వర పురం, జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మొదట ఈ ర్యాలీని గూడు షెడ్ యూనియన్ అధ్యక్షులు మూలం ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ని ఉద్దెశించి సీఐటీయూ నగర కార్యదర్శి జి నాగేశ్వరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దేశం లోని ప్రభుత్వ రంగ సంస్థ లన్నింటిని ఒక్కొక్కటిగా స్వదేశీ, విధేసీ కార్పొరేట్ కంపెనీలకి కారుచౌఖగా అమ్మేస్తుందని అన్నారు.
నెల్లూరు లోని దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధాని కి కట్టబేడుతుందని విమర్శించారు.
వెంటనే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. రేపు ఆత్మకూరు బస్టాండ్ నుంచి జరిగే కార్మిక ప్రదర్శన లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి. శ్రీనివాసులు, సీఐటీయూ నగర నాయకులు వేణు డివైఫ్ఐ నాయకులు యు ప్రసాద్, జాఫర్ తదిరులు పాల్గొన్నారు.