ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు
నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) :
నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు.
ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు చెక్కును కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు ను కలసి విరాళం గా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి ఓఎస్డీ పెంచల్ రెడ్డి , వి పి ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు విజయ్, సర్ఫరాజ్, వెంకట్ పాల్గొన్నారు.