“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి

0
Spread the love

“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి

-: నెల్లూరు‌, ఆగస్టు 5 (స‌దా మీకోసం) :-

 

గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం కాలంలో హౌస్ ఫ‌ర్ ఆల్ ప‌థ‌కం క్రింద కేటాయించి ఇళ్ల‌ను వెంట‌నే త‌మ‌కు స్వాధీనం చేయాల‌ని నిర‌స‌న తెలిపారు.

హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని, అసంపూర్తిగా వున్న ఇళ్ళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి ఉచితంగానే ఇళ్లు ఇస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు లబ్ది దారులు చెల్లించిన వాటా ధనం లబ్దిదారులకు తిరిగి చెల్లించాలని కోరుతూ “సింహపురి పౌర సమాఖ్య” పిలుపు మేరకు నెల్లూరు 30 వ డివిజన్ వి.మాలకొండ రెడ్డి నగర్ లో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ మాదాల వేంకటేశ్వర్లు,నెల్లూరు రూరల్ నాయకులు బత ల కృష్ణయ్య, ఎస్ డి రఫీ అహ్మద్, సిరిమల్లే కోటేశ్వరరావు, షేక్ గౌస్ పీర్ , చెరుకూరి హజరత్త య్యు తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ… నెల్లూరు రూరల్ 1, 2, 3, 30 వ డివిజన్ లలొ నవలాకులతోట,  వి.మాలకొండ రెడ్డి నగర్ నందు పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

“హౌస్ ఫర్ ఆల్”లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేవారు.

అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసారు.

దొరతోపు, మిలిటరీ కాలిని, సుబహాన్ నగర్ ప్రాంతాల‌లో నిరసన తెలిపారు.

కార్యక్రమం లో పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!