కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీమతి సుశీలమ్మ జ్ఞాపకార్ధం సీలింగ్ ఫాన్లు పంపిణీ
కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీమతి సుశీలమ్మ జ్ఞాపకార్ధం సీలింగ్ ఫాన్లు పంపిణీ
-: నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :-
చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు ఏ.రాజ్ కుమార్ తల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా నేడు నెల్లూరు నగరం లోని గీత మయి వృద్ధ ఆశ్రమ0 వారికి 10 సీలింగ్ ఫ్యాన్లులు ఇవ్వడం జరిగింది.
కరోనా లాక్ డౌన్ వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు బదులుగా చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీద ఆశ్రమ నిర్వహుకులు తమ్మినేని పాండు కి అందచేశారు.
కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుశీలమ్మ గారు మంచి సేవా బావాలు కలిగిన పిల్లల కు జన్మనిచ్చారని, వారికి అమె అశీస్సులు, ఈ వృద్ధ ఆశ్రమము లో పెద్దల అశీస్సులు ఉండాలని, సుశీలమ్మ ఆత్మ శాంతి కలగాలని కోరారు.
కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు. పి. హరిక్రిష్ణ. మురళి. ఉదయ్ ఆశ్రమ నిర్వహకుడు తమ్మినేని పాండు తదితరులు పాల్గొన్నారు.