సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను పరిష్కరించాలి : వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను పరిష్కరించాలి
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్, మార్చి 21 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు 4వ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి, కాకుపల్లి గ్రామాలలోని సచివాలయ అధికారులు, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, గ్రామ, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, జిల్లాపరిషత్ కో ఆప్షన్ సభ్యులు అల్లాభక్షు, పెనుబర్తి, కాకుపల్లి గ్రామ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ఎమ్.పి.టి.సి. లు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.