వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం
వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం
-: వెంకటాచలం, మార్చి 26 సదా మీకోసం) :-
అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర శనివారం వెంకటాచలానికి చేరుకుంది.
ఈ సందర్భంగా వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావుతోపాటు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రతో కలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు జై అమరావతి రాజధాని అంటూ నినాదాలు చేస్తూ కొంతదూరం నడిచారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెదరమెట్ల కోదండయ్య నాయుడు, కొండప్ప నాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, బత్తల రఘురామయ్య, షేక్ షరీఫ్, ఆకుల రమణయ్య, శ్రీకాంత్ నాయుడు, వల్లూరు వంశీకృష్ణ, మోడుబోయిన రాజేష్, పాలెపు మణి, షేక్ సత్తార్ సాహెబ్, సండి రమేష్, ఈదర శ్రీనివాసులు, నందకుమార్, కొర్రకూటి పార్థసారథి, యాకల రవి, గుండెమడగుల రమేష్, శ్రీహరి, మందల పవన్ కుమార్, మంగళంపూరి రవి, నల్లగర్ల రమేష్, ఆళ్లపాక మల్లికార్జున్, హరికృష్ణ, రమణయ్య, సాయి, షేక్ జలీల్, విజయ్ కుమార్, మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.