కోవిద్ 19 కారణంగా నగరంలో దుకాణాల సమయాలు ప్రకటించిన కలెక్టర్
కోవిద్ 19 కారణంగా నగరంలో దుకాణాల సమయాలు ప్రకటించిన కలెక్టర్
-: నెల్లూరు నగరం, ఆగస్టు 7 (సదా మీకోసం) :-
జిల్లాలో కోవిడ్ – 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోన వైరస్ నియంత్రణకు ఆగష్టు 9వ తేది నుండి 23వ తేది వరకు 15 రోజులపాటు నగరంలో దుకాణాల సమయాలను జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఒకప్రకటనలో తెలిపారు.
కోవిద్-19 కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నగరంలో ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మాత్రమే దుకాణాలు పనిచేస్తాయని జిల్లా కలెక్టరు తెలిపారు.
వ్యాపారస్తులు స్వచ్చందగా ముందుకురావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ విషయమై ప్రజలందరూ సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.