కరోనా చికిత్స కోసం అదనంగా వెయ్యి కోట్లు-సీఎం జగన్
తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యుల నియామకానికి చర్యలు చేపడుతున్నామని స్ఫష్టం చేశారు.
కొవిడ్ మందుల కోసం వచ్చే 6 నెలల్లో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాప్తి, నిరోధక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన…ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున మెరుగుపరుస్తామన్నారు. మహమ్మారిపై పోరుకు పారామెడికల్, వైద్యుల నియామకం చేపడతామని చెప్పారు.
కొవిడ్ పరీక్షలు, క్వారంటైన్ సదుపాయాల కోసం రోజుకు ఆరున్నర కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వివరించారు. కరోనా బాధితుల కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు అందుబాటులోకి తేవాలన్నారు. క్రిటికల్ కేర్ కోసం 5 ఆస్పత్రుల్లో 2,380 పడకలను ఏర్పాటు చేయాలని సూచించారు.