మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు

0
Spread the love

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు

  • లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు
  • జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు
  • రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది
  • రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం
  • జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు స్పందించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
  • నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్

నెల్లూరు, మార్చి 23 (స‌దా మీకోసం) :

రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర సాధనకోసం, రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం టిడిపి నేతలు భారీ ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతులను బాధ పెడుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని, నేడు టిడిపి ఆధ్వర్యంలో పంచకట్టులతో నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

లాభనష్టాలను సైతం లెక్కచేయకుండా రైతులు పంటలు పండిస్తున్నారనీ , ఈ రోజు ప్రతి ఒక్కరూ మూడు పూట్ల తింటున్నామంటే ఆ ఘనత రైతుకే దక్కుతుంది అని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అబద్ధాన్ని నిజం చేయగల శక్తి నిజాన్ని అబద్ధం చేయగల శక్తి కేవలం వైకాపా నాయకులకు మాత్రమే ఉందని అన్నారు.

రైతుల ఆత్మహత్యలలో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, జగన్ రెడ్డి రైతులకు ఏమి చేయకపోగా, రైతులను ఏదో ఉద్ధరించినట్లు కరపత్రాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నిన్న కూడా చెందిన రైతు కిరణ్ రెడ్డి ఆత్మహత్య యత్నం చేశారని గుర్తు చేశారు.

మూడు పూటలా అన్నం పెట్టే రైతుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొడుతున్నాడు అని, రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేసే వరకు టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.

రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భక్షక కేంద్రాలు అని సోమిరెడ్డి గారు చెప్పిన మాట ముమ్మాటికీ వాస్తవం అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చక్రధర బాబు స్పందించి నెల్లూరు జిల్లాలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి, నగర నియోజకవర్గ ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్ కుమార్, బొల్లినేని వెంకట రామారావు, కంభం విజయ రామీ రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలెపాటి సుబ్బానాయుడు, బొమ్మిరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చంచల్ బాబు యాదవ్, జెన్నీ రమణయ్య, బొమ్మీ సురేంద్ర, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!