100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

Udatha Ramakrishna
Spread the love

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్

నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (స‌దా మీకోసం) :

నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది.

ఈ సంద‌ర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు త‌మ‌ వంతు సహకారంగా, ట్రాఫిక్ నియంత్రించుటకు బారికేడ్స్ అందించిన‌ట్లు తెలిపారు.

పోలీసు శాఖకు ఎటువంటి తోడ్పాటు అందించడానికైనా సిద్దం ఉన్నామ‌ని అన్నారు.

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం దాతృత్వానికి పోలీసు శాఖ తరపున జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ.(అడ్మిన్) సి.హెచ్‌. సౌజన్య, టౌన్ డిఎస్పీ సింధు ప్రియ, మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ క్రిష్ణా రెడ్డి, సెంట్రల్ హెడ్ డా.ధీరజ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్, ట్రాఫిక్ సిఐ లు వెంకటరెడ్డి, రామకృష్ణ, ఎస్‌.బి.-1 సిఐ వెంకటేశ్వర రావు, ఎస్‌.బి.-2 సిఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!

Spread the loveతేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..! పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. తేలు నొప్పి ప్రత్యేకత °°°°°°°°°°°°°°°°°°°° తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది. * నొప్పిగా […]

You May Like

You cannot copy content of this page