దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్
దగాపడిన ధాన్యం రైతాంగం
నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్
నెల్లూరు నగరం, మార్చి 21 (సదా మీకోసం) :
రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన నెల్లూరు జిల్లా ధాన్యం రైతులు తమ పంటలకు మద్దతు ధర కోల్పోయారని బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ స్పందన కార్యక్రమం లో నల్ల కండువాలు ధరించి జెసి హరేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.
అంతకు మునుపు రైతులతో కలిసి నిరసన తెలిపారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలలో అధికార పార్టీ వైసీపీ నేతలు సూచించిన వారికి మాత్రమే కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు తీసుకుంటున్నారని జెసికి వివరించారు.
నెల్లూరు జిల్లాలో వరుసగా 5వ పర్యాయం రైతులు తమ పంటలను నష్టానికి విక్రం ఉంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం లక్ష ఎకరాల్లో పంట దిగుబడి వస్తే బీపీటీ రకానికి ప్రభుత్వం కొనుగోలుకు ఆంక్షలు విధించడంతో పుట్టి 13 వేల రూపాయలకు, అదేవిధంగా నెల్లూరు మసూరా రకం ధాన్యం 12,500 రూపాయలు కు ఆర్ యన్ ఆర్ రకం ధాన్యం కూడా చిన్నకారు రైతులు పుట్టి 13 వేల రూపాయలకే దళారులకు విక్రయించు కోవడం బాధాకరంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఆర్ బి కే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రెండు నెలలైనా రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడం వలన నెల్లూరు జిల్లా రైతులు ఆర్బికెల పట్ల అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు.
జిల్లాలో మరో ఆరు లక్షల ఎకరాల పంట దిగుబడి వేగవంతమైనదని, పోలాలలో ధాన్యం రాశులు నిల్వలు పేరు కుంటున్నాయన్నారు.
ఈ తరుణంలో రైతులు మరింత నష్టపోకుండా సత్వర చర్యలు తీసుకోవాలసిన అవసరం వుందన్నారు.
జిల్లాలో 90 వేల మంది కౌలు రైతుల పరిస్థితి మద్దతు ధర లేనందువలన మరింత ఆర్థిక కష్టాలలోకి నెట్టబడుతున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ స్పందన కార్యక్రమం లో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఓజిలి సుధాకర్, చింత గింజల సుబ్రమణ్యం, కేశవ నారాయణ, మాల్యాద్రి, వీరస్వామి, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.