అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి
-: వెంకటాచలం, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి, కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారన్నారు.
రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు.
అయితే తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అర్హత ఉన్న వారికి జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్లు ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్లకు మాత్రమే ఇచ్చిన పరిస్థితన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దని కితాబిచ్చారు.
రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి ప్రారంభమైందనే దానికి నిదర్శనం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పారదర్శక పాలనేనన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పింఛన్లు అందుకునే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దన్నారు.
సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజల ముంగిటకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన చరిత్ర ముఖ్యమంత్రిదన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పింఛన్లను జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 1405 కొత్త పింఛన్లను ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ ఒక్క నెలలోనే 9 కోట్ల17 లక్షలు రూపాయల పింఛన్ల రూపంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అందించడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వాలు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
గతంలో చంద్రబాబు చేసిన పొరపాట్లు వల్ల సాంకేతిక సమస్యలు వచ్చిన, వాటిని పరిష్కరించి, అర్హులైన వారికి మానవతా దృక్పథంతో పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా పింఛన్ పెంచుకుంటూ పోతూ 3 వేల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
గతంలో చంద్రబాబు దివ్యాంగుల విషయంలో అనేక నిబంధనలు పెట్టి, పింఛన్లు ఇవ్వని పరిస్థితులుంటే, జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులందరికీ ₹3000/-లు పింఛన్ అందజేస్తున్నారన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు.