వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి : ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య

0
Spread the love

వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి

ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య

నెల్లూరు వైద్యం, మార్చి 11 (సదా మీకోసం)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా వైద్యానికి సంబంధించిన కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, ప్రధాన కార్యదర్శి టీ. కామేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో “ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన వైద్య ఆరోగ్య రంగానికి కరోనా కష్టకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  బడ్జెట్ కేటాయింపులు ఎప్పటిలాగానే తక్కువగా ఉండడం చాలా బాధాకరం.

 

ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే  స్థూల ఉత్పత్తిలో  కనీసం 5 % ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని,ప్రస్తుతం జరిగిన 1.2% కేటాయింపులను కనీసం 3% కి పెంచాలని ప్రజారోగ్య వేదిక డిమాండ్ చేస్తుంది.
   ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం సాధారణ ప్రజలకు ప్రభుత్వాసుపత్రులే దిక్కని రుజువు కాబడ్డ కరోన కాలంలో కూడా ఆరోగ్య రంగానికి గత సంవత్సరం బడ్జెట్ కంటే 1500 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 15384 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం చాలా బాధాకరం.

 

ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో  2000 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీకి కేటాయించడం  చూస్తుంటే ప్రభుత్వ వైద్య రంగం అభివృద్ధి జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 18 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి, ఎక్కువమంది వైద్యులను అందుబాటులోకి తెచ్చి, వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం18 వైద్య కళాశాలలను ఏర్పాటు  చేయడం కోసం  కేవలం 320 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. అంటే ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సుమారు 18  కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది.

 

ఈ రకమైన కేటాయింపులతో ఆ కాలేజీలను ఎలా ఏర్పాటు చేయాలి? ఎంత కాలానికి ఏర్పాటు జరుగుతుందన్నది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ లలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరగాలి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరిపడా క్యాన్సర్ వైద్య శాలలు లేవు.వీటిని అభివృద్ధి చేయడం యుద్ధ ప్రాతిపదికన జరగవలసిన అవసరం ఉంది. ఇందుకోసం బడ్జెట్లో కేటాయింపులు జరగాలి.

 శ్రీకాకుళం ప్రాంతంలో లో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని,ఈ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్ ను పలాస లో ఏర్పాటు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్న ఈ ప్రభుత్వం దానికోసం జరగవలసిన కేటాయింపులను విస్మరించడం చూస్తే ప్రజారోగ్యంపై ప్రభుత్వ వైఖరి అర్థం అవుతుంది.

      కరోనా కష్టకాలంలో  ప్రజలు అనేక రకాలైన అనారోగ్యాల పాలవుతున్న ప్రత్యేక  పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందే రకంగా ప్రభుత్వ వైద్యరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని, ఆ రూపంలో అసెంబ్లీలో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని మరియు శాసనసభ్యులను ను ప్రజారోగ్య వేదిక కోరుకుంటుంది” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!