వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్
వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా
బాధతప్త హృదయంతో మీడియా సమావేశం పెడుతున్నా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, ఉద్వేగానికి గురైన రూప్ కుమార్ యాదవ్
తొలి రోజు నుంచి వైసీపీ బలోపేతానికి పునాదిరాయిగా పనిచేశా
రక్త మాంసాలను చెమటగా మార్చి వైసిపి కోసం పనిచేశా
కన్నీటిమయంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రూప్ కుమార్
నెల్లూరు నగరం, ఫిబ్రవరి 28 (సదా మీకోసం) :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్ లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు.
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశానన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావించామని, ప్రతిపక్షాలతో నిరంతరం పోరాటం చేశానన్నారు.
మార్పు సహజం.. మార్పు అనివార్యమని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారన్నారు.
వైసిపి కోసం పునాదులుగా పనిచేస్తే గత ఒకటి న్నర సంవత్సరాలగా కొన్ని రాజకీయ పరిస్థితులు తనను బాధ పెట్టాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు.
రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు రూప్ కుమార్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు.
కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ సన్ను నాగమణి, 48వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.ఆర్. తహసీన్ ఇంతియాజ్, 52వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.కే. అస్మా మైనుద్దీన్, 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత అశోక్, సీనియర్ నాయకులు దార్లవేంకటేశ్వర్లు, కలికి శ్రీధర్ రెడ్డి, నిశ్చల్ కుమార్ రెడ్డి, మూలస్థానేశ్వర దేవాలయం చైర్మన్ లొకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, గోగుల నాగరాజు, మైనారిటీ నాయకులు ఎస్డీ మున్వర్, ఎస్కే హాజీ, ఎస్.ఆర్. ఇలియాజ్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.