ఆరోగ్యం మన చేతుల్లోనే..! : -సర్పంచ్ “ఇంగిలేల”..!!
ఆరోగ్యం మన చేతుల్లోనే..!
-సర్పంచ్ “ఇంగిలేల”..!!
తోటపల్లిగూడూరు, నవంబర్ 23 (సదా మీకోసం) :
మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుందని తోటపల్లిగూడూరు ఇస్కపాలెం సర్పంచ్ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఇస్కపాలెం గ్రామంలో “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకుండా మన ఇంటి పరిసరాలను మనమే పరిశుభ్రంగా వుచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధి తిరిగి ఇళ్ల ముందు వున్న మురికి, మంచి నీటి గుంటలను నిర్వీర్యం చేశారు.
సైడ్ పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తాచెదారంను ఊరికి దూరంగా తరలించాలని సూచించారు.
దోమ తెరలు వాడాలని తెలిపారు. సైడ్ డ్రైన్లలో దోమల నివారణ మందును స్ప్రే చేశారు. దీనికి ముందు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ కన్నం హేమలత,తాసీల్దార్ శ్యామలమ్మ, ఎమ్ఈఓ ఎస్ ఉప సర్పంచ్ పల్లం లత, పంచాయతీ కార్యదర్శి, లెక్చరర్ రామాంజ, ఆరోగ్య కార్యకర్తలు కవిత, సుప్రజ, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.