టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం
: తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి :
-: నెల్లూరు నగరం, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
- మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నారు..
- ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన పార్టీలకు పుట్ట గతులుండవ్..
- రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉండగా.. దాన్ని గవర్నర్ ఎలా ఆమోదిస్తారు..
- ఎన్నికల సమయంలో రాజధాని మార్పు ఉంటుందని ఎందుకు చెప్పలేదు..
- రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడేందుకు మాట మార్చారు..
- రాజధాని రైతుల గుండె ఘోషను సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు..
- 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది..
- రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరమీదకు తెచ్చారు..
- ఈ వ్యవహారం పై బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు…
- టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం
అని అన్నారు.