ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం

ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం
ఎంపీ ఆదాలకు బదులిచ్చిన కేంద్ర మంత్రి
ఢిల్లీ, మార్చి 22 (సదా మీకోసం) :
ఫేమ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 520 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను, ఆంధ్రప్రదేశ్కు 266 ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి పార్లమెంట్లో మంగళవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఇందుకుగాను 2019 నుంచి 2023 వరకు ఐదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కోసం కేటాయించినట్లు తెలిపారు.
రెండో దశ 2877 కింద ఛార్జింగ్ స్టేషన్లను 68 నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇవి 16 హైవేలు, 9 ఎక్స్ప్రెస్ వేలను కలుపుతూ ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. హైవే కి ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 92, విశాఖపట్నంలో 71, తిరుపతిలో 68, కాకినాడలో 35 ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు అవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత రక్షణకు అదనపు నిధులు ఏమైనా ఇచ్చారా ?అని అడిగిన మరో ప్రశ్నకు, ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతానికి కేవలం 21 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, 18 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ బోట్లు పనికి రాకుండా పోయాయని, పోలీస్ స్టేషన్ల సమీపంలో ఎటువంటి జెట్టీలు నిర్మించలేదని, ఇందుకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు.
జెట్టి లను నిర్మించేందుకు మూడున్నర కోట్ల రూపాయలు కాకుండా అదనంగా నిధులు కేటాయించారా అని కూడా అడిగారు. కేంద్ర హోం శాఖ డిప్యూటీ మంత్రి నిశిత ప్రామాణిక్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ పోస్టల్ సెక్యూరిటీ స్కీం ఫేస్1,2 ల కింద ఆంధ్రప్రదేశ్ కు 21 కోస్టల్ పోలీస్ స్టేషన్లు, 7 జెట్టీలు మంజూరయ్యాయి.
27 నాలుగు చక్రాల వాహనాలు, 48 ద్విచక్ర వాహనాలు, 18 బోట్లు కేటాయించి, 2017 జూలై 19 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహణను చేపట్టింది.
ఆ తర్వాత ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కోస్టల్ పోలీస్ సిబ్బంది శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మచిలీపట్నంలో భూమిని కేటాయించింది.
అయినప్పటికీ కేంద్రప్రభుత్వం గుజరాత్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు .