రూ.100 పొదుపుతో రూ.14 లక్షలు మీ సొంతం…!
పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..!
రూ.100 పొదుపుతో రూ.14 లక్షలు మీ సొంతం…!
సెప్టెంబర్ 13 (సదా మీకోసం)
పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి.
పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లో గ్రామ్ సుమంగల్ పథకం కూడా ఒకటి.
ఈ పాలసీ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు.
ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి.
గ్రామ్ సుమంగల్ యోజన పథకంలో రెండు టెన్యూర్స్ ఉంటాయి.
15 ఏళ్లు, 20 ఏళ్లు అనేవి పాలసీ టెన్యూర్స్. మీకు నచ్చిన టెన్యూర్ ఎంపిన చేసుకోవచ్చు.
18 ఏళ్లు నిండిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.
గరిష్టంగా 45 ఏళ్లలోపు వారు పాలసీ తీసుకోవచ్చు.
గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు.
15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. ఆరేళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లకు 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి.
మెచ్యూరిటీ తర్వాత మిగిలిన 40 శాతం పాలసీ డబ్బులు లభిస్తాయి.
అదే 20 ఏళ్ల టెన్యూర్ అయితే.. 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు చొప్పున 20 శాతం డబ్బులు వస్తాయి.
మెచ్యూరిటీ తర్వాత మిగిలిన 40 శాతం డబ్బులు పొందొచ్చు.
పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి పాలసీ డబ్బులు చెందుతాయి.
25 ఏళ్ల వయసులో ఉన్న వారు 20 ఏళ్ల టెన్యూర్‌తో రూ.7 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు దాదాపు రూ.2900 ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
అంటే రోజుకు రూ.100 ఆదా చేస్తే సరిపోతుంది.
పాలసీదారుడికి రూూ.14 లక్షల వరకు వస్తాయి.
బోనస్ కింద రూ.7 లక్షలు.. బీమా మొత్తం రూ.7 లక్షలు లభిస్తాయి.