రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి
రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి
-: కోట, ఆగస్టు 5 (సదా మీకోసం) :-
శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో బుధవారం రామాలయ నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైందని, ఏళ్ల నాటి భారతీయుల చిరకాల స్వప్నం ఇన్నాళ్లకు సాకారం అవుతున్న సందర్భంగా రామజన్మభూమి లో రామాలయ నిర్మాణం శరవేగంగా పూర్తయి భారతీయుల ఆకాంక్ష నెరవేరాలని ఎం. వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆకాంక్షించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కోట మండలం విద్యా నగర్ లోని స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వర రావు గారి నివాసంలో పూజలు నిర్వహాంచారు.
విజయవంతంగా రామ మందిరం పూర్తి కావాలని కోరుకుంటూ ఎం వి రావు ఫౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ సమేత సీతాదేవి. దేవతామూర్తుల చిత్రపటానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు.
తమ వంతుగా ఇటుక రాయికి పసుపు కుంకుమ పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సీతారాముల మందిరం శరవేగంగా పూర్తి కావాలని కోరుతూ సీతారాములకు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రామ మందిర భూమి పూజా వేళ రామచక్కని ఆలయానికి భూమి పూజకు తోడ్పాటు నందించారు.
పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఎందరో మేధావులు చిరకాల స్వప్నం నేటికీ నెరవేరనున్న ఈ రోజు కోసం యావత్ భారతదేశం ఎదురుచూపులు చూస్తోందని అదేవిధంగా రామాలయ నిర్మాణం పూర్తి శ్రీరాముని విగ్రహ మరియు ఇతర దేవతామూర్తుల ప్రతిష్ట జరిగితే భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరి నట్టు అవుతుందని
ఎం వి రావు పౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
కార్యక్రమంలో పౌండేషన్ నిర్వాహకులు వ్యవస్థాపకులు ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, నిర్వాహకులు శ్రీ రామ భక్త బృందం పాల్గొన్నారు.