జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి
జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి
-: నెల్లూరు (జడ్పీ), మార్చి 5 (సదా మీకోసంం) :-
డా. బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రావు చిత్రపటమునకు పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలు చాలా ఆదర్శనీయం అని కొనియాడారు.
ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ, భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, భారతదేశానికి ఉపప్రధానిగా కుడా వ్యవహరించి దేశానికి సేవ చేసినటు వంటి మహానియుని జయంతి సందర్భంగా ఈ రోజు గుర్తుచేసుకోవడం ఆనందంగా వున్నది అని తెలిపారు.
కార్యక్రమం నందు జడ్పీ సిఈవో యం. వాణి, కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కాలేష్, ప్రభావతి భాయి, కొండయ్య, సైలజ, శ్రీనాద్, అసోసియేషన్ నామయకులు ఎ. పెంచలయ్య, బీమిరెడ్డి, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.