నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం
సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
మనుబోలు, డిసెంబర్ 1 (సదా మీకోసం) :
మనుబోలు మండలం వెంకన్నపాళెం, బద్దేవోలు, పల్లెపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించి, ప్రజలను పరామర్శించి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించి, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల స్థలాలలో నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తామని తెలిపారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో ప్రజలు అవస్థల నుండి బయటపడగలిగారన్నారు.
గ్రామాలలో వరదలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేసి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్ ను పునరుద్ధరిస్తున్నామన్నారు.
రైతాంగానికి నారుమళ్లు దెబ్బతిన్న ప్రాంతాలలో 80 శాతం సబ్సిడీతో విత్తనాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.
కండలేరు జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో కాలువల ద్వారా, వాగుల ద్వారా సముద్రంలోకి నీరు వదులుతున్నారని, భారీగా నీరు విడుదల చేయడంతో పొలాలన్నీ జలమయమయ్యాయని, వీలైనంత త్వరగా విడుదలవుతున్న నీటిని క్రమబద్ధీకరించి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు.
ప్రజలకు అవసరమైన భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని, గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకోవల్సిందిగా కోరామని తెలిపారు.
భారీ వర్షాలతో వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఊరట కలిగించేందుకు, అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామన్నారు.