డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

0
Spread the love

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడు

రూర‌ల్ ఎమ్మెల్యేకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌జ‌లు

నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) :

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్ లో సి బ్లాక్ 5వ వీధిలో డ్రైన్ కు కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల,అభివృద్ది క‌మిటి ఛైర్మ‌న్ క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడులు శంకుస్థాపన చేశారు.

ఈ డ్రైన్ గత కొంతకాలంగా పాడై పోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఆ సమస్యను స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడం తో డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు నేను నా కార్యకర్త కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి సమస్యను వివ‌రించారు.

సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలోనే ఈ డ్రైన్ కు శాంక్షన్ ఆర్డర్స్ ఇప్పించ‌డం జ‌రిగింద‌ని హ‌జ‌ర‌త్ నాయుడు తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 33వ డివిజన్ కు దాదాపు మూడు కోట్ల రూపాయల ప‌నుల‌ను చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా డివిజన్ లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, వైసీపీ మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!