డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

0
Spread the love

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

-: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :-

నెల్లూరు నగరంలోని 14 వ డివిజన్ తో పాటు బాలాజీ నగర్ ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లో వచ్చే అన్ని డివిజన్లలో అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

ఈ పరిధిలో వచ్చే మూడు డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ ప్రాంతంలో గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపొందడం ఆయన నియోజకవర్గ ఇన్చార్జి ముఖ్య అనుచరుడుగా ఉండటంతో అతనికి ఈ సారి చెక్ పెట్టేందుకు అన్ని రకాల వ్యూహాలు గత రెండేళ్లుగా జరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో వైసిపిని తిరుగులేని శక్తిగా మార్చేందుకు వైసిపి అన్ని పావులు కదిపింది.

గతంలో 14 వ డివిజన్ లో పోటీ చేసిన ఇద్దరు బలమైన అభ్యర్థులు వైసీపీలో ఉన్నారు.

నెల్లూరు బాలాజీ నగర్ ఏసీ నగర్ లో పర్యటిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా అక్కడి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఈ డివిజన్ లలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలి అన్నారు.

కార్యక్రమంలో కర్తం ప్రతాప్ రెడ్డి , లోకిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వందవాసి రంగా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!