రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు

0
Spread the love

రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు

ఢిల్లీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అక్టోబ‌ర్ 02 (స‌దా మీకోసం) :

తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు.

దిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) .. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneshwari) నిరశన దీక్షలో కూర్చొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు.

సాయంత్రం 5 గంటల వరకు తెదేపా నేతల దీక్ష కొనసాగనుంది.

 

 

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌(NTR) ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దీక్ష చేపట్టారు.

ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, బాలకృష్ణ (Nandamoori Balakrishna) సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ తెదేపా (Telugudesam) రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు దీక్షకు కూర్చొన్నారు.

సాయంత్రం 5 గంటల వరకు తెదేపా నేతల దీక్ష కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!