మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది
మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది
- టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్
- తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు
వెంకటాచలం, నవంబర్ 20 (సదా మీకోసం) :
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెంకటాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి బూతులు తిట్టే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం బూతులు తిట్టే మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టి బొమ్మను పెట్రోల్ పోసి నాయకులు దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. శాసన సభ అంటే చట్టాలు చేసే సభ అలాంటి సభ దేవాలయంతో సమానం అని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దుర్మార్గంగా ప్రవర్తించి ఏపీ అసెంబ్లీని కౌరవ సభలాగా చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడుని అవమానపరిచారన్నారు.
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపజేసిన నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కుమార్తె అయినా చంద్రబాబు సతీమణిని అవమానపరిచే విధంగా మాట్లాడితే తెలుగుజాతి, తెలుగు ప్రజలు ఊరుకోరన్నారు.
తెలుగు ప్రజల కళ్ళల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు నింపిన చంద్రబాబు కళ్ళల్లో కన్నీరు తెప్పించిన అధికార వైసీపీకి పతనం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చేసిన శబదం ఊరికే పోదు, ఆయన చేసిన శబదానికి మేము భాగ్యస్వాములమై మీ శబదం నెరవేర్చేందుకు మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు ఎన్నుకున్న చట్టసభల సభ్యులే సంస్కార హీనులుగా ప్రవర్తించే పరిస్థితి రావడం సహించరాని విషయమన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడును వైసిపి రాజకీయంగా ఎదుర్కొనలేక నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.
మా నాయకుడిని రాజకీయంగా ఎదుర్కొనలేక కుటుంబ సభ్యులను బయటకు తీసుకు వచ్చి వారిపై అసభ్యకరంగా మాట్లాడించడం బాధాకరం అన్నారు.