పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు
నెల్లూరు నగరం, జూన్ 4 (సదా మీకోసం) :
గత 19 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 19వ రోజు మైపాడు రోడ్డు, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది.
ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరిని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని అన్నారు.
ప్రజలు తమ బాధలు పంచుకునేందుకు ఎవరొస్తారా అని చూస్తుంటే తాము వచ్చామని చెప్పడం చూస్తుంటే తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఓ బాలుడు అడిగిన వీధి లైట్, ఓ పెద్దావిడ అడిగిన నీటి కుళాయి తాము ఏర్పాటు చేశామని, తమ స్థాయిలో పరిష్కారం అవ్వగల సమస్యలను పరిష్కరిస్తున్నాం అని అన్నారు.
పింఛన్ లేనటువంటి వృద్ధులు, వితంతువులు తమకు సమస్య చెప్తే పవనన్న ప్రజాబాటలోనే సంబంధిత సచివాలయాలను సందర్శించి అధికారులకు విన్నవిస్తున్నామని తెలిపారు.
నేడు తిరిగిన ప్రాంతాల్లో పలువురు విశ్రాంత ఉద్యోగులైన వృద్ధులు తమకు జగన్ ప్రభుత్వం సకాలంలో పెన్షన్ వేయట్లేదని, గతంలో ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పడే పెన్షన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా 15 నుండి 20 రోజుల వరకు వేచిచూడాల్సి వస్తుందని ఆవేదన చెందారన్నారు.
వృద్ధులైన కొంతమంది విశ్రాంత ఉద్యోగులు పలువురికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కొందరికి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని, పెన్షన్ ఆలస్యం అవుతుండంతో ఇబ్బందిగా మారిందని తెలిపారు.
రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీ ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే షణ్ముఖ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.