సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం….. 14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన
సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం
14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన
నెల్లూరు కార్పొరేషన్, జూలై 19 (సదా మీకోసం) :
స్థానిక 14 వ డివిజను బాలాజీ నగర్, తదితర ప్రాంతాల్లో పూడుకుపోయిన డ్రైను కాలువలను నగర పాలక సంస్థ కమిషనర్ మంగళవారం పరిశీలించారు.
వర్షాకాలం నేపధ్యంలో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
డ్రైను కాలువల్లో ఎలాంటి చెత్త, ప్లాస్టిక్ బ్యాగ్ లను పార వేయవద్దని స్థానిక ప్రజలకు కమిషనర్ సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణ విధుల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహించారు.
చెత్త సేకరణ వాహనాలను రోజుకు మూడు తడవలుగా వినియోగించి అన్ని డివిజనులను పరిశుభ్రంగా ఉంచేలా పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, సచివాలయ శానిటరీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.