కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం”

0
Spread the love

కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం”

పొదలకూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) :

పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తూ, “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పేరిట వారం రోజులపాటు నియోజకవర్గంలో ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించడంలో భాగంగా, బస్టాండ్ సెంటర్ వరకు ప్రజలతో కలిసి భారీ ఊరేగింపుగా వెళ్లి, యువత ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీలో సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, పూలు చల్లి ధన్యవాదాలు తెలియజేశారు.

స్వచ్చందంగా తరలి వచ్చిన యువత, నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లతో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు.

బాణసంచా పేల్చి, మేళతాళలతో వేలాది మంది జనంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవ వాతావరణాన్ని తలపిస్తూ, ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ, జ‌నం ముందుకు సాగారు. ఈ సంద‌ర్భంగా కాకాణి మాట్లాడుతూ, స‌ర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే అంతర్భాగంగా కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు త‌న‌ విజ్ఞప్తిని మన్నించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్ర రాష్ట్రం విభజనకు గురై, హైదరాబాద్ ను కోల్పోయినప్పుడు ఆంధ్ర ప్రజలు ఎంత వేదనకు గురయ్యారో, సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా నుండి విడిపోతుందేమోనని సర్వేపల్లి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు.

నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తూ నిర్ణయం వెలువడడంతో ఆవేదన, ఆందోళనకు గురవుతున్న ప్రజలలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు మిన్నంటాయని తెలిపారు.

చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. “జగనన్న ప్రసాదించిన వరం” సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి నిదర్శనం, పొదలకూరు మండల కేంద్రంలో స్వచ్చందంగా వేల సంఖ్యలో జ‌నం పాల్గొన్నారు.

వారం రోజుల పాటు నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా ప్రారంభించిన తొలి రోజున, పెద్ద ఎత్తున తరలివచ్చి, జగన్మోహన్ రెడ్డి గకి ధన్యవాదాలు తెలియజేసి, ర్యాలీ విజయవంతం చేసిన వారందరికీ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!