అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
-: నెల్లూరు నగరం, జూలై 16 (సదా మీకోసం) :-
గుర్రాల మడుగు సంగం, నక్కలపల్లి సంగం, తుమ్మల కట్ట సంఘం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ఇల్లు తొలగిస్తారనే ఆందోళన చెందుతున్న బాధితులకు భరోసా కల్పించారు.
అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. ఒక్క ఇల్లు తొలిగించి నా తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ఎన్నికల సమయంలో గుర్రాల మడుగు ప్రజలకు అప్పటి నగర ఎమ్మెల్యే, నేటి మంత్రి అనిల్ అప్పట్లో ఇచ్చిన హామీ వీడియోను బాధితులకు చూపించారు.
ఆయా ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుంచి కొన్ని కుటుంబాలకు కరెంట్ కట్ చేయడం పై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అధికారం ఉందని మీరు విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, ఇల్లు తొలగిస్తున్నారని తెలిసిన మరుక్షణమే గుర్రాల మడుగులో ప్రత్యక్షం అవుతానని భరోసా ఇచ్చారు.
మంత్రి అనీల్ మాటలు విని అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సర్వేపల్లి కాలువ పనులు అంతా అవినీతి మయమైందని మండిపడ్డారు.
ప్రాజెక్ట్ అంచనాలు పెంచి ప్రజల సొమ్మును మంత్రి అనీల్ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వేపల్లి కాలువ పనులను రివర్స్ టెండరింగ్ కు పోకుండా సుమారు 50 కోట్ల మేర అవినీతికి మంత్రి అనీల్ పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.