గ‌తంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువ‌నేశ్వ‌రి ప్ర‌సాద్‌

0
Spread the love

గ‌తంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువ‌నేశ్వ‌రి ప్ర‌సాద్‌

-: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 2 (స‌దా మీకోసం) :-

నెల్లూరు న‌గ‌రంలో ఆగ‌స్టు నెల‌లో బ్రాహ్మ‌ణుల‌కు పెంష‌న్లు పంపిణీ చేయ‌డంపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో ఈ క్రింది వివ‌రాల‌ను అదించారు. ఆగ‌స్టు నెలలో సచివాలయాల ద్వారా డివిజన్లలో పంచిన బ్రాహ్మణుల పెంషన్లు బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి సచివాలయాల బదలీ అయినవని తెలియచేశారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక కారణాల దృష్ట్యా ఇబ్బందులు పడుతున్న పేదలకు తెలుగు దేశం ప్రభుత్వం ఒక కుటుంబంలో ఇద్దరికి కూడా పెంషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో 22 వేల మందికి పెంషన్లు ఇవ్వడం జరిగిందనీ, వీటిలో నెల్లూరు నగరంలో 54 డివిజన్లలో 900 మందికి పెంషన్లు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ఇచ్చామని తెలిపారు.

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి పధకాలన్నీ రద్దుచేసేసిందని విమ‌ర్శించారు.

ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయిన బ్రాహ్మణులు నిరసనకు తలవొగ్గిన సర్కారు కేవలం పెంషన్లను మాత్రమే ప్రభుత్వ పెంషన్లలో కలిపి సచివాలయాలకు పంపిందన్నారు.

ఆ పెంషన్లనే నేడు డివిజన్లలో పంచారనీ, ఇంకా కొంత మందికి రాలేదని తెలిపారు.

సచివాలయాలకు పేర్లు రాని వారు మమ్మల్ని సంప్రదిస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ వారితో సంప్రదించి తెప్పిస్తామన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందనీ, రేషన్ కార్డ్ లేని వారి పెంషన్ తీసేస్తామని, ఒకే కుటుంబంలో ఇద్దరికి పెంషన్ ఉంటే ఒకటి తొలగిస్తారని వార్తలు వస్తున్నాయన్నారు.

ప్రస్తుతం ఇస్తున్న పెంషన్లు ఏవి తొలగించవద్దని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ అనేక కారణాల వలన ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలలో వారికి భార్య భర్తలకు ఇద్దరికి పెంషన్లు ఇచ్చామని గుర్తు చేశారు.

రెండు నెలల తర్వాత నిబంధనలు అమలు చేసి పెంషన్లు కోత విధిస్తారనే వార్తలు వస్తున్నాయనీ, ఎట్టి పరిస్థితులలో కూడా వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు అని హెచ్చ‌రించారు.

ఒక్క‌ బ్రహ్మణులే కాదు ప్రస్తుతం ఇస్తున్న ఎవరి పెంషన్లయినా తొలగించవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఆగ‌స్టు నెల‌లో సచివాలయాల ద్వారా పంచిన బ్రాహ్మణుల పెంషన్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బదలీ అయినవని తెలియ చేస్తూ ఇంకా ఎవరికైనా రాకుంటే నాకు సమాచారం ఇస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ వారితో మాట్లాడి తెప్పిస్తామని తెలియచేస్తున్నామన్నారు.

ఇప్పటివరకు వస్తున్న పాత పెంషన్లకు ఇంటికి ఒకటే పెంషన్ నిబంధనను వర్తింప చేయకుండా ఇక మంజూరు చేయబోయేఈ పెంషన్లను మాత్రమే నిబంధనలు వర్తింపచేయలని డిమాండ్ చేస్తున్నామ‌ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియచేస్తున్నామని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!