మంత్రి అనిల్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడతాం : కోటంరెడ్డి
మంత్రి అనిల్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడతాం
- పేదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది
- టిడిపి నెల్లూరు నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
-: నెల్లూరు నగరం, ఆగష్టు 1 (సదా మీకోసం) :-
మంత్రి పదవి రాగానే అధికార గర్వంతో విర్రవీగుతూ పేదల ఇల్లు కూలుస్తున్న మంత్రి అనిల్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడతామని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు.
నెల్లూరు నగరంలోని సి ఆర్ పి డొంకలో ఆదివారం ఆయన పర్యటించారు.
అక్కడున్న ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఓ టిఫిన్ అంగడి దగ్గర కూర్చొని దోసెలు పోసి అక్కడ అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని నమ్మి ఓట్లేసిన ప్రజలను పిడి గుద్దులు గుద్దె అనిల్ ఆ సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు.
గత ఎన్నికల్లో మోసపూరితమైన అనేక వాగ్దానాలతో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన మంత్రి అనిల్ అధికారంలోకి రాగానే పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
బినామీ కాంట్రాక్టర్ల కోసం మంత్రి అనిల్ నానా అవస్థలు పడుతున్నారన్నారు.
సర్వేపల్లి కాలువ 100 కోట్ల పనుల కోసం పేదల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, ప్రోక్రెయిన్లు పంపడం అధికార పార్టీ జులుం కి నిదర్శనమన్నారు.
ప్రజలే అంతిమ నిర్ణేతలని త్వరలోనే మంత్రి అవినీతికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కోటంరెడ్డి హెచ్చరించారు.
కార్యక్రమంలో బాబు, టి రాజా, రవి, సుమంత్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు,
హనుమంత రావు, పసుపులేటి మల్లికార్జున్ తరితరులు పాల్గొన్నారు.