గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు

గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు
-: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :-
నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే మత్స్యశాఖ ప్రతిపాదలను నిరసిస్తూ మాట్లాడారు.
నెల్లూరు జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు.
లేదంటే 25వేల కుటుంబాలు వీధిన పడుతాయని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విన్నవిస్తామనీ, అప్పటికీ ఉపసంహరించుకోకపోతే ప్రజా, న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయన తమ డిమాండ్ లైన చేపల చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయొద్దు,
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు వంటి వాటిని ప్రభుత్వం ముందుంచారు.
సమావేశంలో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు బి.ఎల్. శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేవూరు సుబ్బారావు, కండలేరు, కలువాయి, అల్లూరు, కనిగిరి రిజర్వాయర్, తురిమెర్ల సోసైటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నేడు నెల్లూరు లోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల పాలకవర్గ సభ్యులను వెల్లడించారు.