వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్

0
Spread the love

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) :

ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేయడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఇటు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ కుటుంబాల నుండి పలువురు స్పందించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక‌ వీడియో ద్వారా స్పందించారు.

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణంగా ఉంటాయని.. కానీ అవి ప్రజా సమస్యల మీద జరగాలి.. కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందన్న జూనియర్ ఎన్టీఆర్.. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కకి పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో అది ఒక అరాచక పాలనకి దారితీస్తుందని తారక్ వెల్లడించాడు.

ముఖ్యంగా ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడడం చాలా తప్పని.. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతని, మన జీవనాడులలో, జవజీవాలలో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం ఆడపడుచుని గౌరవించడం. అలాంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని రాబోయే తరానికి భద్రంగా అప్పగించాలి కానీ.. ఇలా సంస్కృతి, సంప్రదాయాలని కాల్చేసి రాబోయే తరానికి ఇదే బంగారు బాటని మీరనుకుంటే చాలా పెద్ద తప్పు చేసిన వారవుతారని తారక్ పేర్కొన్నాడు.

ఈ మాటలను తాను వ్యక్తిగత దూషణకి గురైన ఇంటి సభ్యుడిగా మాట్లాడడం లేదని.. ఒక తల్లికి కొడుకుగా.. ఒక స్త్రీకి భర్తగా.. తండ్రిగా.. ఈ దేశ పౌరుడిగా.. ఒక తెలుగు వాడిగా మాట్లాడుతున్నానని తెలిపాడు. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం.. ఈ సంస్కృతిని ఇక్కడితో ఆపేసి.. ప్రజాసమస్యల మీద దృష్టి పెట్టాలని.. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!