జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా?

జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా?
పార్లమెంట్లో ప్రశ్నించిన ఆదాల
ఢిల్లీ, మార్చి 21 (సదా మీకోసం) :
ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అభ్యసించే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం పూర్తిస్థాయి ఫీజును తిరిగి చెల్లించే జగనన్న విద్యా దీవెన లాంటి పథకం అమలు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పార్లమెంట్లో ప్రశ్నించారు.
ఒకవేళ అమలు చేస్తే దాని విధివిధానాలు ఏమిటో తెలపాల్సిందిగా కూడా కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యను కోల్పోకూడదనే ఉద్దేశంతో వివిధ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ తదితర వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.
ఆయా పథకాలను బట్టి రిజర్వేషన్ విధానం అమలు అవుతుందని పేర్కొన్నారు. యూజీసీ స్కాలర్షిప్పులు, ఫెలోషిప్ లను యూనివర్సిటీ ర్యాంకు హోల్డర్స్కు గేట్, జిప్యాట్, ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా,పి.జి ప్రొఫెషనల్ కోర్సులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.