దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట
దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 142వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని తూగుమాలమిట్ట రోడ్డు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దసరా పర్వదినాన ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని దుర్గా మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కేతంరెడ్డి కోరారు. పండుగ పూట ఇంటింటికీ తిరుగుతున్న సందర్భంలో మహిళలు ఇంట్లో పూజ చేసిన తిలకం దిద్ది ప్రసాదం పెట్టి కేతంరెడ్డిని ఆశీర్వదించారు.
జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జరుగుతున్న పవనన్న ప్రజాబాట పట్ల స్థానికులు అపూర్వ ఆదరణ చూపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.