కోవిడ్ ఆస్ప్రత్రిలో కామపిశాచి.. ఒంటరి మహిళపై డాక్టర్.. దారుణం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయడం లేదు కామాంధులు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలపై కీచకులు రెచ్చిపోయి లైంగిక దాడులకు తెగబడుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయిన కీచక డాక్టర్ కరోనా బాధిత మహిళపై లైంగిక దాడికి యత్నించిన అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. యూపీలోని గజియాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
అలీగఢ్‌కి చెందిన మహిళ(28) గజియాబాద్‌లో నివాసముంటోంది. ఆమెకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అలీగఢ్‌లోని డీడీయూ కోవిడ్ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా బాధితురాలిపై కన్నేసిన డాక్టర్ నీచానికి దిగాడు. కామంతో రగిలిపోతూ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. తనకు డ్యూటీ లేకపోయినా రౌండ్స్ పేరుతో ఆమె గదిలోకి వెళ్లాడు. అదనుచూసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు అప్రమత్తమయ్యేలోపే అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
ఆమె తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కామాంధుడు వదల్లేదు. మరోసారి రేప్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎలాగో కామపిశాచి నుంచి తప్పించుకున్న బాధితురాలు దారుణాన్ని ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. డ్యూటీ లేకపోయినా ఆస్పత్రిలోనే ఉండడంతో పాటు బాధితురాలి గదిలోకి వెళ్లినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.