ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది
ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..!
విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది
– ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి
విడవలూరు, నవంబర్ 20 (సదా మీకోసం) :
పెన్నా నది ఉధృతంగా పారుతుంటే లోతట్టు ప్రాంతాలు అయిన విడవలూరు మండలం లోని ముదివర్ధి, వూటుకూరు,పెద్దపాళ్ళెం, రామతీర్థం గ్రామాలు నీట మునిగి ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ పరిస్థితులును నేడు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదేశాలు మేరకు విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగి ప్రజల్లో ధైర్యం నింపారు.
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడుతూ, పెద్దపాళ్ళెం గ్రామంలో 75 శాతం ఇల్లు మునిగిపోతే కనిసం అధికారు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు అని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయారు నీట మునిగిన ప్రజలను వదిలేశారు వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో కూడా విఫలం అయ్యారన్నారు. ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారు,పొలాల్లో ఉన్న మోటార్లు,వలలు,బొట్లు అన్ని నష్టపోయారని తెలిపారు.
ఈరోజు కూడా వరదలు ఇలానే కొనసాగితే ప్రాణ నష్టం వచ్చే ప్రమాదం ఉంది వెంటనే అధికారులు స్పందించి ప్రజల కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, సీనియర్ నాయకులు మాతూరు శ్రీనివాసులురెడ్డి, దయాకర్ రెడ్డి, మత్స్యకార సంఘం నియోజకవర్గ నాయకులు పాపారావు, తిరుపతి, దశరధి, తిరుపతి, కనకరావు, శివశంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.