మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్
మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్
నెల్లూరు కార్పొరేషన్, ఆగష్టు 5 (సదా మీకోసం) :
నెల్లూరు నగరపాలక సంస్థ మేయరు స్రవంతి జయవర్ధన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ డి.హరిత శుభాకాంక్షలను తెలిపారు.
కార్యాలయంలోని మేయర్ ఛాంబరు నందు శుక్రవారం ఉదయం కమిషనరు మేయరును కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు.
సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకుంటూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కమిషనరు ఆకాంక్షించారు.