సోమిరెడ్డి విమర్శలకు కాకాణి కౌంటర్

0
Spread the love

సోమిరెడ్డి విమర్శలకు కాకాణి కౌంటర్

-: నెల్లూరు, ఆగష్టు 1 (స‌దా మీకోసం) :-

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం, నాయకులు కేవలం, “రాజకీయ లబ్దికోసం” సాగునీటి జలాల విషయంలో రగడ సృష్టిస్తున్నారని విమ‌ర్శించారు.

ఉమ్మడి జలాశయమైన శ్రీశైలం నుండి సముద్రంలో కలిసే అదనపు జలాలు వృధా కాకుండా, ఆంధ్ర రాష్ట్ర రైతాంగం వాడుకునేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “ఎత్తిపోతల పథకాలు” ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేశారని తెలిపారు.

ఎగువన ఉన్న “ఆల్మట్టి”, “బాబ్లీ” ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లే, ఇవ్వాళ తెలంగాణ నియంతృత్వ పోకడల వల్ల, ఆంధ్ర రాష్ట్రానికి సాఫీగా సాగునీరు అందేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారన్నారు.

ఎగువన ఉన్న రాష్ట్రాలు న్యాయంగా మనకు రావాల్సిన నీటి వాటాలను అడ్డుకుంటూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, చంద్రబాబు మొద్దు నిద్రపోతుంటే, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు “పోరాటాలు” చేశారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం “శ్రీశైలంలోని నీటిని సముద్ర పాలు” చేస్తుంటే, ముఖ్య‌మంత్రి వెంటనే స్పందించి, కేంద్రం దృష్టికి తీసుకొనివెళ్ళారని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం కృష్ణా, గోదావరి నదుల నీటిని సక్రమంగా పంపిణీ చేసేందుకు మేనేజ్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేసి, “గెజిట్ నోటిఫికేషన్” విడుదల చేసింది.

కేంద్రం జోక్యంతో విడుదలైన “గెజిట్ నోటిఫికేషన్” మీద తెలంగాణ గగ్గోలు పెడుతుంటే, చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చ‌ర్య అన్నారు.

చంద్రబాబు తెలంగాణ ఏర్పాటు కోసం “ద్వంద్వ వైఖరి” అవలంబించి, ఆంధ్ర, తెలంగాణ విడిపోవడానికి బీజం వేసినట్లే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తన శాసనసభ్యులు చేత “ప్రాంతాల వారీగా ఉద్రిక్తతలు” రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.

వై.యస్.రాజశేఖర్ రెడ్డి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న “పోతిరెడ్డిపాడు” ను 44 వేల క్యూసెక్కుల విస్తరించడానికి ప్రయత్నిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాయలసీమ, నెల్లూరు జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేశారన్నారు.

సోమిరెడ్డి మిల్లర్లతో కూర్చుని “ధాన్యం కొనుగోళ్లలో ముడుపులు” మాట్లాడుకున్నంత తేలికగా, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పడం, హాస్యాస్పదమ‌ని తెలిపారు.

తెలంగాణ ప్రాంత నాయకుల “రెచ్చగొట్టే ప్రసంగాలతో”, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహృదభావ వాతావరణంలో కూర్చుని, మాట్లాడుకునే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు.

సోమిరెడ్డి పంచె కట్టి, టేబుల్ చుట్టూ పది మందిని కూర్చోబెట్టి, “రౌండ్ టేబుల్ సమావేశ” మంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

సోమిరెడ్డి తాను రైతునని “భ్రమ కల్పించేందుకు” పంచెకట్ట గలిగాడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయాడో చెప్పాలని ప్ర‌శ్నించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత “సంగం, నెల్లూరు బ్యారేజీ” పనులు పూర్తి చేయడంతోపాటు, సోమశిల, కండలేరు వరద కాలువను “25 వేల క్యూసెక్కులకు” విస్తరిస్తున్నామ‌ని తెలిపారు.

చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల “హంద్రీనీవా, పులిచింతల, వెలుగొండ ప్రాజెక్టులు” నిర్లక్ష్యానికి గురై, రైతాంగ అవసరాలకు సమృద్ధిగా సాగునీరు అందకుండా పోయిందన్నారు.

చంద్రబాబుకు “విజన్” ఉంది, తాను అధికారంలో ఉంటే వర్షాలు పడవు, సాగునీరు అందదు కాబట్టి, సాగునీటి సమస్యలు ఉత్పన్నం కావు, నీరే లేనప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కట్టవలసిన అవసరమే లేదు.. అన్నది “చంద్రబాబు విజన్” అని అన్నారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో, సకాలంలో వర్షాలు పడటం, జలాశయాలలో నీరు పుష్కలంగా చేరుతుండడంతో “జలవివాదాలు” ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఆంధ్ర రాష్ట్ర రైతాంగం కోసం అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి అందరూ సహాయ సహకారాలు అందించాలి తప్ప, లేనిపోని విమర్శలతో “చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని” తెలుగుదేశం నాయకులకు నా మనవి అని అన్నారు.

ముఖ్యమంత్రి “ఆంధ్ర రాష్ట్ర రైతుల హక్కుల పరిరక్షణ కోసం”, సాఫీగా రైతులకు సాగునీరందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!