షాడో లతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోంది : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
షాడో లతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోంది
మంత్రి గా అనిల్ కుమార్ యాదవ్ సాధించింది ఏమీ లేదు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
మంగళగిరి, ఏప్రిల్ 13 (సదా మీకోసం) :
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర (Beeda Ravichandra Yadav) మాట్లాడుతూ, నిధులు, విధులు లేనట్టి మంత్రివర్గం ఏర్పాటు చేసి, షాడో లతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర మంత్రివర్గం లో చోటు దక్కాలంటే ఇసుక, మైనింగ్, గ్రావెల్, అవినీతి, భూకబ్జాలతో పాటు మహిళల పై దాడుల్లో అగ్రగణ్యులు గా ఉండాలన్నారు.
అవినీతి, దోపిడీ, అరాచకాల లో భాగస్వాములైన వారికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయన్నది ప్రస్తుత కేబినెట్ కూర్పు ను చూస్తే అర్థం అవుతోందన్నారు.
మంత్రివర్గ విస్తరణ, ప్రజా సమస్యల పై స్పందించే తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి ఎంత బలహీనులో అర్ధం అవుతోంది… రాష్ట్రం లో షాడో పాలన సాగుతోంది,
మంత్రులు సంతకాల కు మాత్రమే పరిమితం అయ్యారన్నారు. మంత్రివర్గం లోని బీసీ మంత్రులను అసమర్ధులు గా భావించి తొలగించారా ? లేక అవినీతి పరులని గుర్తించి తొలగించారా ? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ లకు అగ్ర తాంబూలం ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోంది…. ఇరిగేషన్ మంత్రిగా 3 ఏళ్ల కాలంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అర్థం అవుతోంది వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ పాటిదో… అర్ధం అవుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, నారా లోకేష్ ని తిట్టడం తప్ప ఇరిగేషన్ శాఖ మంత్రి గా అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) సాధించింది ఏమీ లేదని, కనీసం జిల్లాలో ఉండే ఎమ్మెల్యే లను కూర్చోబెట్టి సమీక్ష చేసిన పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో కాదు కదా, జిల్లా స్థాయి లో అప్పటికే పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేని నిస్సహాయ స్థితి ఆయనిదన్నారు. టీడీపీ హయాంలో పూర్తి అయిన ఇళ్లకు తాళం చెవులను సైతం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందించలేక పోయారు. 3 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఉన్నప్పటికి పెన్నా, సంగం బ్యారేజ్ లు, కావలి కెనాల్, తెలుగుగంగ కెనాల్, ఉత్తర కాలువలు, సోమశిల పనులలో ఏ ఒక్కటీ పూర్తి చేయలేకపోయారన్నారు.
వైసీపీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి చెత్త పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను టాయిలెట్ పన్నులతో ప్రజలను “బాదుడే బాదుడు” అన్నట్లు రాష్ట్రం లో వైసీపీ పాలన సాగుతోందని విమర్శించారు. దుర్మార్గులను,అవినీతిపరులను మంత్రులుగా చేసి, బీసీ లను ఉద్దరించామని, బలహీన వర్గాలకు, దళితులకు అవకాశాలు కల్పించామని వైసీపీ చెబుతున్న బూటకపు ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణం కు పోయినా ” మోసపోయాం..తప్పు చేశాం”, “రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్లీ రావాలి ” అన్న ప్రజల ఆకాంక్షలు వినిపిస్తున్నాయి… వైసీపీ పాలన కు ప్రజలు చరమ గీతం పాడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు.