రాజకీయాలకు, పార్టీలకు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.పి.గూడూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద 3435 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం […]
SPSR నెల్లూరు

ప్రగతి ఛారిటీస్ చిన్నారులకు అన్నదానం
జిల్లా ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్పగుడి సమీపంలోని ప్రగతి ఛారిటీస్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు షేక్ షాజీర్, అప్సానా దంపతుల కుమారుడు ముహమ్మద్ అర్హాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్ధులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాలీద్ మాట్లాడుతూ మానసిక ఎదుగుదల లోపించిన […]
నెల్లూరులో లాక్‌డౌన్ అమలు.. నిబంధనలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. తాజాగా నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూలై 31 వరకు ఈ నిబంధనలు అమలవుతాయని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే […]
బొల్లినేని నర్సింగ్ కళాశాల కోవిడ్ క్వారెంటన్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురం లో ఉన్న బొల్లినేని నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఆకస్మికంగా సందర్శించి, క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న వైద్య సేవలు, భోజన వసతులను పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్ లో ఇప్పుడు ఉన్న బెడ్స్ సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ […]
వైసీపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు టిడిపి కోర్టులు చుట్టూ ప్రదక్షిణలు -ఎమ్మెల్యే కాకాణి
జగన్మోహన్ రెడ్డి మునుపు ఎన్నడూ లేని విధంగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకం కింద, ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేది ఇళ్ల పట్టాలు […]
నెల్లూరులో మళ్లీ లాక్ డౌన్
నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్. రేపటినుండి జూలై 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఉదయం 6గం నుండి మధ్యాహ్నం 1గం వరకు నిత్యావసర సరుకులకు అనుమతి. ఇక ఇప్పటికే కావాలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరులో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు.
వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం-అప్రమత్తంగా ఉండాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచనలు చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సిలో.., గురువారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి.., ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, జిల్లా వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి..? అన్ని ఆస్పత్రుల్లో మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా..? అని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలను అడిగారు. జిల్లాలో అన్ని ప్రైవేటు […]
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తాం-లేఅవుట్ లను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు జిల్లా విడవలూరులో గురువారం మద్యాహ్నం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించారు. తొలుత ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.., ఆర్డీఓ, ఎమ్మార్వోతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిచనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం విడదవోలు పేదలు ఇవ్వడానికి సిద్ధం చేసిన.., ఇళ్ల ప్లాట్ల లే అవుట్ ని కలెక్టర్ పరిశీలించారు. లే అవుట్ లో ఎంతమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు..? అర్హులందరికీ పట్టాలు […]
కరోనా రోగులతో కలెక్టర్ కాన్ఫరెన్స్
వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులతో కలెక్టర్ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి మాట్లాడారు. నగరంలోని జెడ్పీ ఆవరణలో గల డీఈఓసీ కేంద్రం నుంచి జూమ్ యాప్ ద్వారా కలెక్టర్ రోగులతో మాట్లాడారు. ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స ఎలా అందుతోంది.. వైద్యులు అందుబాటులో ఉన్నారానని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తారని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రోజూ జూమ్ […]

