జిల్లా ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్పగుడి సమీపంలోని ప్రగతి ఛారిటీస్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు షేక్ షాజీర్, అప్సానా దంపతుల కుమారుడు ముహమ్మద్ అర్హాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్ధులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాలీద్ మాట్లాడుతూ మానసిక ఎదుగుదల లోపించిన చిన్నారులకు మనోస్థైర్యం కల్పించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతాయని, లాక్ డౌన్ నేపధ్యంలో ఛారిటీస్ లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు తమ వంతు సాయం అందించామని పేర్కొన్నారు. కుటుంబాలలో జరిగే చిన్నచిన్న శుభకార్యాలను ఇలాంటి వారి మధ్య జరుపుకుంటే విద్యార్థుల మానసిక ఎదుగుదలకు తోడ్పాటును అందించిన వారిగా ఆదర్శంగా నిలవగలమని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ముహమ్మద్ అర్హాన్ కుటుంబ సభ్యులు షమీరుల, ఖాదర్ బాషా, రహంతుల్లా, మహబూబ్ బాషా, సద్దాం హుస్సేన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు-ఎమ్మెల్యే కాకాణి
Fri Jul 24 , 2020
Spread the loveరాజకీయాలకు, పార్టీలకు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.పి.గూడూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద 3435 మంది లబ్ధిదారులను […]
