అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తాం-లేఅవుట్ లను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు జిల్లా విడవలూరులో గురువారం మద్యాహ్నం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించారు. తొలుత ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.., ఆర్డీఓ, ఎమ్మార్వోతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిచనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం విడదవోలు పేదలు ఇవ్వడానికి సిద్ధం చేసిన.., ఇళ్ల ప్లాట్ల లే అవుట్ ని కలెక్టర్ పరిశీలించారు. లే అవుట్ లో ఎంతమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు..? అర్హులందరికీ పట్టాలు అందిస్తున్నారా..? లే అవుట్ లో అంతర్గత రోడ్లు, మార్కింగ్ ని పరిశీలించారు. పేదలకు ఇవ్వనున్న లే అవుట్ లో.., ఉన్న విద్యుత్తు లైన్ ని చూసిన కలెక్టర్ దానిని లే అవుట్ నుంచి తొలగించి, లే అవుట్ వెలుపలగా వెల్లేలా నిర్మించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఇప్పటికే విద్యుత్తు లైన్ ను మార్చడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని.., ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ కలెక్టర్ కి తెలిపారు. లే అవుట్ లో పేదలకు ఇవ్వడానికి ఇళ్ల పట్టాలు సిద్ధం మయ్యాయని.., లాటరీ ప్రక్రియ కూడా పూర్తైందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లే అవుట్ లో ఇళ్ల పట్టాలు పొందిన ప్రజలు కలెక్టర్ ని కలిశారు. తమకు ఇళ్ల ప్లాట్లు ఇస్తుంన్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బోధ కాలుతో బాధపడుతున్న వృద్ధురాలు కలెక్టర్ ని కలిసి తనకు ఏదైనా లోన్ అందించి సహాయం చేయాలని కోరారు. ఆమె పరిస్థితిని గమనించి కలెక్టర్.., ప్రభుత్వం తరఫున నిబంధనల ప్రకారం అందాల్సిన సహాయం అందించాలని గ్రామకార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్లు లేని పేదలు ఎవ్వరూ ఉండకూడదని.., ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని.., ఆగస్టు న అందరు ఇళ్లులేని పేదలందరికీ పట్టాలు అందించడానికి ప్రభుత్వం, అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని.., అర్హులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఇళ్ల పట్టాలు పొందిన వారు, స్థానికులు పాల్గొన్నారు.