ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి : నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

0
Spread the love

ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి

నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

-: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :-

15 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్న మంత్రి అనీల్ నెల్లూరు న‌గరాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాల‌ని టీడీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు.

గ‌త ప్ర‌భుత్వంలో పైసా ప‌న్నులు పెంచ‌కుండా తాము అభివృద్ది చేశామ‌ని ఆయ‌న అన్నారు. నెల్లూరులోని ఎన్టీయార్ భ‌వ‌న్లో జరిగిన స‌మావేశంలో ఆయ‌న మండిప‌డ్డారు.

నెల్లూరు న‌గ‌రంలో ఏం అభివృద్ది చేశార‌ని, ఇంటిప‌న్నులు , ఆస్తిప‌న్నులు పెంచుతున్నార‌ని కోటంరెడ్డి ప్ర‌శ్నించారు.. ప్ర‌తిప‌క్షం లేద‌నే ప‌న్నులను పెంచేందుకు సిద్ద‌మ‌య్యార‌ని అన్నారు.

ప‌న్నులు క‌ట్ట‌మ‌ని ఇంటికి వ‌స్తే.. అంద‌రూ తిర‌గ‌బ‌డాల‌ని ఆయ‌న సూచించారు.. ప‌న్నుల కోసం ఎవ‌రినైనా ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నెల్లూరు న‌గరానికి మంత్రి అనీల్ చేసింది శూన్య‌మ‌న్నారు.

రెండు సంవత్సరాల నుండి కడుపు నిండా తిండి కూడా తినకుండా ప్రజలు బతుకుతుంటే ఇంటి పన్నులు,కరెంటు బిల్లులు, మీ ఇష్టానుసారం పెంచేసి అవి చాలవన్నట్టు కొత్తగా చెత్త పన్ను వేసి ప్ర‌జ‌ల‌ను పీక్కుతింటారా అని శ్రీనివాసుల‌రెడ్డి ప్ర‌శ్నించారు.

పాలన చేతకాక ప్రజలను పన్నుల పేరుతో పీడించుకు తింటున్న పాలకులను ఒకటే హెచ్చరిస్తున్నామ‌న్నారు. చెత్తపన్నును వెంటనే రద్దు చెయ్యాలని.. పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.

అలాకాకుండా ప్రజలను భయ‌భ్రాంతులకు గురిచేసి వారి వద్దనుంచి వసూలు చేస్తామంటే ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జా ఉద్య‌మాలు చేస్తాని ఆయ‌న హెచ్చ‌రించారు.

స‌మావేశంలో మమీడాల మధు, క‌ప్పిర శ్రీనివాసులు, కువ్వరపు బాలాజీ, మోయుద్దీన్, సాబీర్ ఖాన్, నరసింహ చౌదరి, దర్శి హరి, మస్తాన్, సురేష్, కొండ ప్రవీణ్ శశి తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!