మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల

మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల
కోవూరు, ఆగస్టు 1 సదా మీకోసం :
మూడు రాజధానులు బిల్లును గవర్నరు ఆమోదించడాన్ని నిరసిస్తూ అమరావతి JAC పిలుపుమేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపడము జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార పార్టీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు మూడు రాజధానులు బిల్లును ఆమోదించ వద్దని గవర్నరిని ముక్తకంఠంతో కోరినా, ఈ బిల్లుపై హైకోర్టు, సుప్రీంకోర్టు లో కేసులు నడుస్తున్నా గవర్నరు ఈ బిల్లును అమోదించడము రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
రాష్ట్రములో కరోనా విజృంభిస్తున్న తరుణములో, దేశంలోని అత్యధిక కేసులు మన రాష్ట్రంలో నమోదు అవుతున్న తరుణములో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి మూడు రాజధానులు బిల్లును ఆమోదించుకున్నారనీ, దీనిని బట్టి ముఖ్యమంత్రికి ప్రజల ప్రణాల కంటే రాజకీయా ప్రయోజనాలే ముఖ్యం అని తేలిపోయిందన్నారు.
నాడు చంద్రబాబు నాయుడు రాజధానిని అమరావతిలో పెట్టేముందు అసంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పారు మడమ తిప్పారని అన్నారు.
రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం కు మర్చితే నెల్లూరు జిల్లాకే ఎక్కువ నష్టం. నెల్లూరుకు 250 కి.మీ లలో ఉన్న అమరావతి కంటే 650 కి మీ దూరంలో ఉన్న విశాఖపట్నం రాజధాని అయితే నెల్లూరుకు ఏ విధంగా ప్రయోజనమూ జిల్లా మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు.
అదేవిధంగా నెల్లూరు నుండు సరైన రవాణా సైకార్యలు లేని కర్నూలు లో హైకోర్టు పెట్టడము వలన నెల్లూరు జిల్లాకు ఏవిధంగా ఉపయోగమో మంత్రులు చెప్పాలన్నారు.
మూడు రాజధానులు వలన నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నందున జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ ఏకమై పోరాడవలసిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్ర తీవ్రంగా నష్టపోతోందనీ,బావి తరాల భవిష్యత్తు అంధకారం అవుతుంది కావున ముఖ్యమంత్ర గతంలో తను అసంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి అమరవతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పాలూరు వెంకటేశ్వర్లు, ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి, కలికి సత్యనారాయణ రెడ్డి,కలువాయి చెన్నకృష్ణారెడ్డి, అగ్గి మురళి, ఇంటూరు విజయ్, గోపాల్, బాబు తదితరులు పాల్గొన్నారు