కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్
కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్
- పవనన్న ప్రజాబాటతో పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నారు
- మీ పోరాట పటిమ నచ్చింది, పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి, అంతా మంచే జరుగుతుంది
- ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాను
- త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలను ఏర్పాటు చేస్తున్నాను
- కేతంరెడ్డి వినోద్ రెడ్డితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
మంగళగిరి, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 125 రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం పురోగతిని వివరించారు.
నియోజకవర్గంలో ప్రజలు వివరిస్తున్న పలు ముఖ్యమైన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించారు.
పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఇంటికీ వెళ్ళి పార్టీ సిద్ధాంతాలను, షణ్ముఖ వ్యూహాన్ని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రం రూపంలో తీసుకెళ్లడం చాలా బాగుందని, మీ పోరాట పటిమ నచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రారంభమవడం సంతోషాన్ని కలిగించిందని కేతంరెడ్డితో పవన్ కళ్యాణ్ అన్నారు.
పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని తాను గమనిస్తున్నానని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఏర్పాటు చేస్తున్నానని, నియోజకవర్గ స్థాయిలో మరింత బలంగా పనిచేసేందుకు అవి దోహదపడతాయని, పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయండని, అంతా మంచే జరుగుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి, హేమంత్ రాయల్, వీరమహిళ శిరీషారెడ్డి ఉన్నారు.