వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం-అప్రమత్తంగా ఉండాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచనలు చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

0
Spread the love

నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సిలో.., గురువారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్  డా. ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి.., ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, జిల్లా వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి..? అన్ని ఆస్పత్రుల్లో మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా..? అని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలను అడిగారు. జిల్లాలో అన్ని ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ మహమ్మారి నిర్మూలణలో మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నా కలెక్టర్.., వచ్చే రెండు నెలలు ఎంతో కీలకమని, దానికి తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. తమ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ.., వైద్యులు, నర్సులు, మెడికల్ స్టాఫ్ కరోనా భారిన పడ్డారని.., అందువల్ల సేవలు అందించడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆస్పత్రి యాజమాన్యాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.., తమకు తాగడానికి హాట్ వాటర్ కావాలని, రిసెప్షన్ లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని కోరారని.., వారికి హాట్ వాటర్, వాష్ రూంలలో ప్రత్యేకంగా బక్కెట్లు, మగ్గులు ఏర్పాటు చేయాలని.., పేషెంట్స్ కి ఒక్కొక్కరికీ రోజుకి మూడు మాస్కులు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
జి.జి.హెచ్ కోవిడ్ ఆస్పత్రిలో పరిస్థితులపై జి.జి.హెచ్ సూపరింటెండ్ తో సమీక్షించిన కలెక్టర్.., భోజనం నాణ్యతపై ఇప్పటికీ ఫిర్యాదులు వస్తున్నాయని.., వైద్యుల కోసం ఏ భోజనం తెప్పిస్తున్నారో..? క్వారంటైన్ లో ఉన్నవారికి కూడా అదే భోజనం తెప్పించాలని ఆదేశించారు. ప్రతిరోజూ నాలుగువేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన కలెక్టర్.., ట్రూనాట్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్య తక్కువగా ఉందని.., దానిని పెంచాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయ సిబ్బందితో కో-ఆర్డినేట్ చేసుకుని.., గ్రామస్థాయి నుంచి జిల్లాలో అసలు ఎంతమంది పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు..? ఎంతమంది హోం క్వారంటైన్ లో ఉన్నారు..? కరోనా చికిత్స తీసుకుని, ఎంతమంది నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఇళ్లకు వెళ్లారు అనే అన్ని వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశించారు. మెడికేర్, అపోలో ఆస్పత్రులకు.., అవసరమైన వైద్య సిబ్బందిని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో జి.జి.హెచ్ సూపరింటెండ్  సుధాకర్ రెడ్డి, ఇంచార్జి డి.ఎం.హెచ్.ఓ, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!