జడ్పీలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
జడ్పీలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
ఆయన ప్రాణ త్యాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పటు
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు జడ్పీ, మార్చి 16 (సదా మీకోసం) :
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాదన కొరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగములను ఎంతో కొనియాడారు.
ఆయన ఆమరణ నిరాహార దీక్ష, వారి ప్రాణ త్యాగము వలన మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగిందని తెలిపారు.
ఆ మహనీయుని పేరు మన జిల్లాకి పెట్టడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమం నందు జడ్పీ సిఇవో యం.శ్రీనివాస రావు, కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.